Book Creator

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి స్వయంవ్యక్త (పుట్టుశిల) పుణ్యక్షేత్రము

by Narasimha Murthy B P

Cover

బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన రవ్వలకొండ ప్రదేశం
బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువులకాపరి గా ఉంటూ రవ్వలకొండ లో కాలజ్ఞానం వ్రాసారు. ఆవుల చుట్టూ గీతగీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లె కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గుహాలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసారు కనుక కొండలను 'బ్రహ్మంగారి కొండలు' అని కూడా పిలుస్తారు
ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి యే నమః . బనగానపల్లె మండలము లో రవ్వల కొండ పై స్వయం వ్యక్త శ్రీ పావన లక్ష్మీ నరసింహ స్వామి పుట్టుశిల వెలసిన ప్రాంతము లో గుడి నిర్మాణము వెనుక కొంత చరిత్ర ఉన్నది. ఎక్కడో కడప లో నివసించు చున్న సుబ్బ నరసమ్మ, నరసింహులు గారి రెండవ సంతానమైన పావన నరసింహ మూర్తి గారు తన విద్యా భ్యాసం SSC మరియు ITI వరకు కడప లో ముగించుకొని తరువాత ఉద్యో గా ర్థి యై బనగానపల్లె కు వచ్చి అక్కడి ITI యందు ఇన్స్ట్రక్టర్ గా 1986 నుండి 1995 వరకు పని చేసి అక్కడి అప్పటి ప్రిన్సిపాల్ గా రైన శ్రీ Y LN Reddy గారికి ఆప్త మిత్రుడి గా ఉంటూ రంగయ్య శెట్టి గారి తో మరియు ప్రసాద్ రావ్ గారి తో కలిసి మెలిసి తిరుగుతూ,ముక్కు సూటి వాడిగా నలుగురీ లో పేరు తెచ్చుకొని కూడా పెళ్ళాం పిల్లలను దూరం చేసుకొని తిరిగి పెళ్ళి చేసుకోన కుండా ,తల్లి తండ్రి,గురువు,దైవం, అని నమ్మిన వాడై తల్లిని సేవించు చూ తరువాత తల్లి సేవ లోనే గడిపి ఆమె తరువాత దైవం మీద దృష్టి మరల్చి ఆ దైవ సేవ లో భాగం గా నే 2011 లో ఒక వెండి విగ్రహం (2.5 kg Rs 1.64 lakshs ) దిగువ అహోబిలం లోనీ అప్పటి EO గారైన నరసయ్య గారికి అందజేయడం జరిగింది .తరువాత ఎగువ అహోబిలం లో గుడి వెనుక భాగంలో ఒక చిన్న విగ్రహం ప్రతిష్టించడం జరిగింది. ఆ విగ్రహం ఇప్పుడు రోజూ కొన్ని వందల మంది తో పూజలందుకుంటున్నది.
బనగానపల్లె మండలము రవ్వ ల కొండ పై వెలసిన స్వయం వ్యక్త (పుట్టు శిల ) శ్రీ శ్రీ శ్రీ చెంచులక్ష్మి సమేత పావన లక్ష్మీ నరసింహ స్వామి వారి చరణార విందములకు నమస్కరించి, గుడి నిర్మాణ కర్త ,అర్చకులు, అయిన శ్రీ పావన నరసింహ మూర్తి గారి ఆత్మావలోకనం వారి మాటల లోనే ,....... నా బాల్యము అంతయు కడప,పులివెందుల లోనే గడిపి నాను కడప లో ఆరు నుండి పది వరకు చదివాను అప్పుడు హరినాథ్ ( ప్రస్తుత జిల్లా జడ్జి, హైదరాబాద్) అను మిత్రునితో కలిసి మెలసి చదువంటే ప్రాణ మంటూ పోటీపడి చదివే వాళ్ళం.ఆ వయసు లోనే మహా భారతము ,శివాజీ చరిత్ర విని తల్లి యొక్క ప్రాధాన్యత ను తెలుసు కున్నాను.తల్లిని మించిన దైవం లేదు అని దృఢం గా నమ్మాను . తరువాత పులివెందుల లో గూడూరు వెంకట చల మయ్య అను నతని తో పరిచయ మైంది .నా తల్లి సేవ లో అతను కూడా చాలా సహాయ సహకారాలు అందించారు .అపుడను కొన్నాను దేవుడు ఎక్కడో లేడు,మానవత్వము ఉన్న తల్లి లోనూ నా మిత్రుల లోనూ దాగి ఉన్నాడ ని.అందుకే బనగానపల్లె యందు తల్లి సేవలోనే గడిపాను .
ఆమె తరువాత మిత్రులలో దైవాన్ని వేదక్కుంటు ప్రతి స్వాతి కి అహోబిలం వెళ్ళడం, మిగిలిన కాలమంతా మానవ సేవయే మాధవ సేవ అంటూ గడుపు తున్నపుడు ,ఒక సారి స్వాతి కై పాములేటీ నుండి తిరుగు ప్రయాణం లో ఒక్క సాధువు వెంట రావడం గుడి కట్టమంటు నాకు గట్టిగా చెప్పి అంతర్ధానం అవ్వడం తో దిక్కు తోచని స్థితిలో ఉండి చివరకు గుడి నిర్మాణము నకే పూనుకు న్నాను .అప్పుడు కూడా మిత్రులు ప్రోత్స హించడం తో 06-02-2014 న రథ సప్తమి నాడు డాక్టర్ వై.వి. సూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డాక్టర్ సి.శ్రీనివాసులు గారు,శ్రీ. జి.వెంకట కృష్ణ య్య ,మరియు వారి ధర్మ పత్ని శ్రీమతి సుశీల గారు ,మరియు శ్రీ వి.హరి హర ప్రసాద్ వారి ధర్మ పత్ని శ్రీమతి అరుణ గార్లు ,శ్రీ గోపాల్ దాస్ గారు , శ్రీ పెరుసోముల రామమోహన్ స్వామి గారి సమక్షం లో రాజేష్ బ్రదర్స్ గారి చే భూమి పూజ చేయడం జరిగింది .అప్పటి నుండి ఆ స్థలములో ఎన్నో విశేషములు కనిపిస్తూ ఉండినవి 
.సుజాతమ్మ గారి సమక్షములో,పుట్టు శిల బయట పడటం,పాము పుట్ట,అందులో ఎనిమిది అడుగుల పాము, మూడు అడుగుల పాము, కనిపించడం, నిర్మాణం మొదలవగానే రాళ్ళు తోలు ట్రాక్టర్ డ్రైవర్ మొదట భగవానుని చేత సురక్షితముగా అనుగ్రహి హింప బడటం , తక్కువ లోతు లోనే బోరు లో నీరు పడటం ,పుట్టుశిల ను దర్శించు కొను వారికి వారి వారి ఇష్ట దైవం లా వారికి కనిపించడం, అంధు రాలికి చూపు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, సంతాన భాగ్యం కల్పించడం భూమి పూజ నుండే అఖండ జ్యోతి తో పూజ లందు కొంటూ ప్రతిష్టకు ముందే ఎందరికో ఎన్నో విధములు గా స్వామి వారు మహిమలు చూపి అనుగ్రహించారు.19-08-2017 న స్థిర ప్రతి ష్టు లైనారు
PrevNext