Book Creator

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి స్వయంవ్యక్త (పుట్టుశిల) పుణ్యక్షేత్రము

by Narasimha Murthy B P

Pages 4 and 5 of 22

Loading...
బనగానపల్లె మండలము రవ్వ ల కొండ పై వెలసిన స్వయం వ్యక్త (పుట్టు శిల ) శ్రీ శ్రీ శ్రీ చెంచులక్ష్మి సమేత పావన లక్ష్మీ నరసింహ స్వామి వారి చరణార విందములకు నమస్కరించి, గుడి నిర్మాణ కర్త ,అర్చకులు, అయిన శ్రీ పావన నరసింహ మూర్తి గారి ఆత్మావలోకనం వారి మాటల లోనే ,....... నా బాల్యము అంతయు కడప,పులివెందుల లోనే గడిపి నాను కడప లో ఆరు నుండి పది వరకు చదివాను అప్పుడు హరినాథ్ ( ప్రస్తుత జిల్లా జడ్జి, హైదరాబాద్) అను మిత్రునితో కలిసి మెలసి చదువంటే ప్రాణ మంటూ పోటీపడి చదివే వాళ్ళం.ఆ వయసు లోనే మహా భారతము ,శివాజీ చరిత్ర విని తల్లి యొక్క ప్రాధాన్యత ను తెలుసు కున్నాను.తల్లిని మించిన దైవం లేదు అని దృఢం గా నమ్మాను . తరువాత పులివెందుల లో గూడూరు వెంకట చల మయ్య అను నతని తో పరిచయ మైంది .నా తల్లి సేవ లో అతను కూడా చాలా సహాయ సహకారాలు అందించారు .అపుడను కొన్నాను దేవుడు ఎక్కడో లేడు,మానవత్వము ఉన్న తల్లి లోనూ నా మిత్రుల లోనూ దాగి ఉన్నాడ ని.అందుకే బనగానపల్లె యందు తల్లి సేవలోనే గడిపాను .
Loading...
Loading...
Loading...
Loading...
Loading...
ఆమె తరువాత మిత్రులలో దైవాన్ని వేదక్కుంటు ప్రతి స్వాతి కి అహోబిలం వెళ్ళడం, మిగిలిన కాలమంతా మానవ సేవయే మాధవ సేవ అంటూ గడుపు తున్నపుడు ,ఒక సారి స్వాతి కై పాములేటీ నుండి తిరుగు ప్రయాణం లో ఒక్క సాధువు వెంట రావడం గుడి కట్టమంటు నాకు గట్టిగా చెప్పి అంతర్ధానం అవ్వడం తో దిక్కు తోచని స్థితిలో ఉండి చివరకు గుడి నిర్మాణము నకే పూనుకు న్నాను .అప్పుడు కూడా మిత్రులు ప్రోత్స హించడం తో 06-02-2014 న రథ సప్తమి నాడు డాక్టర్ వై.వి. సూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డాక్టర్ సి.శ్రీనివాసులు గారు,శ్రీ. జి.వెంకట కృష్ణ య్య ,మరియు వారి ధర్మ పత్ని శ్రీమతి సుశీల గారు ,మరియు శ్రీ వి.హరి హర ప్రసాద్ వారి ధర్మ పత్ని శ్రీమతి అరుణ గార్లు ,శ్రీ గోపాల్ దాస్ గారు , శ్రీ పెరుసోముల రామమోహన్ స్వామి గారి సమక్షం లో రాజేష్ బ్రదర్స్ గారి చే భూమి పూజ చేయడం జరిగింది .అప్పటి నుండి ఆ స్థలములో ఎన్నో విశేషములు కనిపిస్తూ ఉండినవి